కల్లు గీయడానికి తాటిచెట్టు ఎక్కిన గీత కార్మికుడు.. గుండెపోటుతో అదే చెట్టు మీద కన్నుమూశాడు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. మోత్కూర్ పరిధిలోని రాజన్నగూడెం గ్రామానికి చెందిన లక్ష్మయ్య(68) అనే గీత కార్మికుడు కల్లు గీసేందుకు బుధవారం ఉదయం తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీస్తుండగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో చెట్టుపైనే లక్ష్మయ్య ప్రాణాలొదిలాడు. స్థానిక రైతులు లక్ష్మయ్యను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని జేసీబీ సాయంతో కిందకు దించారు.
Read Also: ఆ రెండు తప్ప.. ప్రజలకు ఏదీ ఫ్రీగా ఇవ్వొద్దు
