హైదరాబాద్: తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని చెప్పారు. అదే సమయంలో, గాలి వేగం గంటకు 30-40 కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఈమేరకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
హైదరాబాద్లో ఒక్కసారిగా మూడ్ మారిపోయింది
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భగభగలతో ఊగిపోతున్న భాగ్యనగరం మధ్యాహ్నం కురిసిన వర్షంతో ఒక్కసారిగా చల్లబడింది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
తెలంగాణ ఎల్లో అలర్ట్ తర్వాత 5 రోజులు వర్షాలు…! appeared first on T News Telugu
