
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డును అందుకున్నారు. రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కేంద్రం ఇటీవల ప్రకటించిన 46 అవార్డుల్లో తెలంగాణ 9 విభాగాల్లో 13 అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
అన్ని రంగాల్లో ముందుండి, అత్యధిక అవార్డులు అందుకున్న తెలంగాణకు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. రాష్ట్రపతికి మంత్రి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి ముందు కేంద్ర పంచాయ త్రాజ్ శాఖ మంత్రి టీ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దయాకర్ రావుతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, రాష్ట్ర మంత్రి మోరేశ్వర్ పాటిల్, రాష్ట్ర కార్యదర్శి సునీల్ కుమార్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
