తెలంగాణలో కక్ష రాజకీయాలు తక్కువ. ఓడినవారు గెలిచిన వారిని వేధించటం వంటివి ఇక్కడ చాల అరుదు. అలాంటిది ఈ కొత్త సాంప్రదాయానికి కాంగ్రెస్ తెలంగాణలో తెరతీసిందా అని చర్చ మొదలైంది. ఎన్నికలు ముగిసిన నాటి నుండి బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అక్రమ కేసులు బనాయిస్తూనే వస్తుంది. అకారణంగా బీఆర్ఎస్ కార్యకర్తలని వేధిస్తున్నారు. వారిని భయబ్రాంతులకు గురిచేసి పార్టీమార్చడమో లేక మనోధైర్యాన్ని దెబ్బతీయటమో టార్గెట్ గా కాంగ్రెస్ కేసులు పెడుతుందని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కూడా సీరియస్ గా రియాక్ట్ అయింది.
తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దని.. బీఆర్ఎస్ లీగల్ టీమ్ వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇది జరిగి కొన్ని రోజులు కాకుండానే ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీపై కేసు నమోదు చేయించారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభ్యర్థన మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రంజిత్ రెడ్డిపై కేసు పెట్టారు. అయితే రంజిత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని 20న విశ్వేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతి తీసుకొన్న బంజారాహిల్స్ పోలీసులు రంజిత్‌రెడ్డిపై ఐపీసీ 504 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇక బీజేపీలో ఉన్నా.. కొండా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని అంటారు. కాంగ్రెస్ లోకి రమ్మని పలుమార్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరి రేవంత్ రెడ్డి వేడుకున్న సందర్భాలు ఉన్నాయి.
