హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్లు ప్రకటించారు.
కాగా, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, వనపర్తి తదితర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం, ఈదురు గాలులు వీచాయి. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ ఆరెంజ్ అలర్ట్ తర్వాత… మరో రెండు రోజులు భారీ వర్షాలు…! appeared first on T News Telugu
