పదేండ్ల పాటు నానా బాధలు పడిన కాంగ్రెస్ ఎట్టకేలకు అనేక అబద్ధాలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం నిలబడదని, ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం విభజించిందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చాం… రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆశించిన కాంగ్రెస్ కు.. తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదు
The post తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం తథ్యం appeared first on tnewstelugu.com.
