బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో ప్రతి ఇంచు మీద సమగ్రమైన అవగాహన ఉందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ( మంగళవారం)చలో నల్లగొండ బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. నీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లించాలో ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించాలో కేసీఆర్కు బాగా తెలుసునని అన్నారు. కృష్ణానదీ జలాల్లో న్యాయమైన వాటా కోసం గొంతెత్తి నినదించిన ఏకైక తెలంగాణ నాయకుడు కేసీఆరేనని స్పష్టం చేశారు. సభకు నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు భారీగా తరలివచ్చారని అన్నారు నిరంజన్ రెడ్డి.
ఇది కూడా చదవండి:ఇది రాజకీయ సభ కాదు.. ఉద్యమ సభ, పోరాట సభ
