రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు (గురువారం) వాయువ్య తెలంగాణలో ఒకటి రెండు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
ద్రోణి మరియు గాలిలో అనిశ్చితి పశ్చిమ విదర్భ నుండి మరఠ్వాడా మరియు లోతట్టు కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు గరిష్టంగా 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణం, ఆగ్నేయం నుంచి రాష్ట్రంలోకి అల్పస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో ఏప్రిల్ 30, మే 1 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా పడిపోవచ్చు.
