
తెలంగాణ రాష్ట్రంలో వడగళ్ల వాన కురియడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో నేడు (శుక్రవారం), రేపు (శనివారం) ఉరుములు, మెరుపులతో కూడిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
పంటలు దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించి దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు పరిహారం ప్రకటించారు.
