తెలంగాణలో 95 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్ శాఖలలో అధికారుల బదిలీలు జరిగాయి. తాజాగా పోలీస్ శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది. వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న 95 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఇవాళ(బుధవారం)ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులను బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. గత మూడేళ్లుగా ఒకేచోట పని చేస్తోన్న, సొంత జిల్లాల్లో పని చేస్తోన్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ గత డిసెంబర్‌లో ఆదేశించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారులను బదిలీ చేసింది.
ఇది కూడా చదవండి:యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
