తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం శాసనమండలిలో చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు..భూమి, నీటిని తల్లితో పోలుస్తాం, అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఓ ప్రొఫెసర్ తెలంగాణ తల్లి ప్రతిమను రూపొందించారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఓ సామాజికవర్గ దొరసాని గుర్తుకు వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం సమంజసం కాదన్నారు.
సింగిల్‌గా ఏ నిర్ణయం తీసుకోమన్నారు కాంగ్రెస్ నేతలు. విగ్రహం, చిహ్నం తయారీలో బీఆర్ఎస్ నేతల సలహాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కాకతీయ రాజులు తెలంగాణ సమాజానికి ఎంతో మంచి పనులు చేశారు. నిజాం రాజులు హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని దేశపతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ దేశం కోసం చేసిన సేవలపై గౌరవం ఉందని దేశపతి అన్నారు. జాతీయ నాయకుల పేర్లు అనేక వాటికీ పెట్టుకున్నామని.. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌కి పెట్టుకున్నామని.. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన దగ్గర రాజీవ్ విగ్రహం పెట్టడం సరికాదన్నారు.
ఇది కూడా చదవండి:17న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు
