హైదరాబాద్: గర్భిణులకు సురక్షితమైన అబార్షన్‌ను అందించడంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సమగ్ర అబార్షన్ కేర్ (సీఏసీ) అమలుపై కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సర్వే నిర్వహించింది.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని నిలోఫర్ ఆస్పత్రి, కింగ్‌కోఠి ఆస్పత్రి, షాలిని ప్రైవేట్ ఆస్పత్రిలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక బృందం సందర్శించింది. ఒక్కో రాష్ట్రం పనితీరు ఆధారంగా కేటాయించిన ర్యాంకింగ్‌లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలంగాణకు “అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్”ను అందించింది. ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి నేషనల్ మెడికల్ డిపార్ట్మెంట్ కో-డైరెక్టర్ పద్మజ అవార్డును అందుకున్నారు. కేంద్రం ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ సిబ్బందిని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు.
