
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి టీ ఫైబర్ కార్యాలయాన్ని తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పాలినావిల్ త్యాగరాజన్ సందర్శించారు. ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను కొనియాడారు. టీ ఫైబర్‌లో ఉపయోగించే సాంకేతికత మరియు అధికారిక విధానాల గురించి ఆయన అడిగారు. తమ రాష్ట్రంలో కూడా టీ ఫైబర్ టెక్నాలజీని అవలంబిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా తమిళనాడు ఐటీ శాఖ మంత్రి త్యాగరాజన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ ఐటీ రంగం 9 ఏళ్లలో అద్భుతంగా పురోగమిస్తోందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ, ఐటీ పాలసీ అద్భుతంగా ఉందని, ఈ విధానాన్ని అవలంబిస్తామని మంత్రి కేటీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ బృందానికి వివరించారు. తమిళనాడు ఐటీ మంత్రిగా ఆయన.. కావాల్సిన విధానాలను తమిళనాడులో అమలు చేస్తాం’’ అని మంత్రి త్యాగరాజన్ అన్నారు.
