హైదరాబాద్: నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వైభవాన్ని ప్రతిబింబించేలా కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. సచివాలయ నిర్మాణాన్ని వినూత్న రీతిలో చేశామన్నారు.
మన తెలంగాణ సచివాలయం దేశంలోనే తొలి పర్యావరణహిత మహాద్భుతమని సీఎం పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
