
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్రూమ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించేందుకు వర్చువల్ రియాలిటీ (వీఆర్) లేబొరేటరీ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వర్చువల్ రియాలిటీ ద్వారా, విద్యార్థులు జీవశాస్త్ర పాఠాలు, గుండె మరియు కణాల నిర్మాణ పనితీరును తెలుసుకోవడానికి VR సాంకేతికతను ఉపయోగిస్తారు.
రాష్ట్రంలోని ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల కోసం ఇంటరాక్టివ్ వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా అభ్యసన నైపుణ్యాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా, ప్రతి పాఠశాల ల్యాబ్‌లో 20 వీఆర్ హెడ్సెట్లు, 20 బీన్ బ్యాగ్‌లు, 1 టాబ్లెట్, 1 స్టోరేజ్ బాక్స్, 1 కేవీఏ యూపీఎస్‌లను అమర్చనున్నారు. ఈ ల్యాబ్‌లలో 5 నుంచి 10వ తరగతి వరకు బోధించనున్నారు.
