బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. తెలంగాణ భవన్ కు ఆయన మూడు నెలల తర్వాత వచ్చారు. ఈ సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులు ఆయనకు హారతి ఇచ్చి ఆహ్వానం పలికారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను కేసీఆర్ సమీక్షించనున్నారు. కృష్ణా బేసిన్ లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరుబాటకు సంబంధించిన కార్యాచరణపై నేతలకు కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు.
కేసీఆర్ సమీక్షా సమావేశానికి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు కూడా తెలంగాణ భవన్ కు వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై కూడా చర్చించనున్నారు. తెలంగాణ ప్రయోజనాలపై ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకపోయే విధంగా ఉద్యమ కార్యాచరణ చేయనున్నారు కేసీఆర్.
ఇది కూడా చదవండి: మహిళతో అమర్యాదకర ప్రవర్తన: మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ సస్పెన్షన్
