తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రిజిస్టర్‌పై సంతకం చేశారు. ప్రొ.జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు.
అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఎంపీలు కేశరావు, నామా నాగేశ్వరరావు, సంతోష్ కుమార్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనా చారి, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మహాసభ జరిగింది.
