నేటికాలంలో చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక్కప్పుడు 60ఏళ్లు పైబడిన వారిలోనే తెల్లజుట్టు కనిపించేది. కానీ ఇప్పుడు 6ఏళ్ల పిల్లలకు కూడా తెల్లజుట్టు వస్తుంది. కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు. అయితే మనలో చాలా మంది తెల్లజుట్టును నల్లగా మార్చుకునేందుకు మార్కెట్లో లభించే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. అవి వాడిన కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ..తర్వాత కాలం సైడ్ ఎఫెక్స్ట్ ను ఎదుర్కొవల్సి వస్తుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంట్లోనే దొరికే వస్తువులతో సహజంగా తయారు చేసుకోవచ్చు. ఆవనూనె ఆరోగ్యానికే కాదు జుట్టుకు మేలు చేస్తుందని మీకు తెలుసా? అవును తెల్లజుట్టును నల్లగా మార్చడంలో ఆవనూనె ప్రభావంతంగా పనిచేస్తుంది. ఎలాగో తెలుసుకుందాం.
ఆవాల నూనెలో మెంతులు:
సహజంగా ఆవాల నూనెల జుట్టును నల్లగా మార్చుతుంది. ఆవాల నూనెలో మెంతిపిండిని కలిపి..గోరువెచ్చగా మరిగించాలి. మెంతిరసం పూర్తిగా నూనెలో కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. నూనె మాడిపోకుండా జాగ్రత్తగా వేడిచేయాలి. చల్లారిన తర్వాత ఆ నూనెను ఫిల్టర్ చేసి సీసాలో భద్రపరుచుకోవాలి. ప్రతిరోజూ లేదా వారానికి మూడు సార్లు ఆ నూనెను మీ జుట్టుకు అప్లయ్ చేయండి.
ఆవాల నూనెతో ఉసిరి:
ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి శరీర ఆరోగ్యానికే కాకుండా జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ముఖ్యంగా జుట్టుకు మంచి డార్క్ కలర్ ఇస్తుంది.ఆవనూనెతో కలిపి వాడితే తెల్లజుట్టు పోయి మళ్లీ నల్లగా మారడం ప్రారంభమవుతుంది. ఆవాల నూనెలో ఉసిరి పొడి వేసి మీడియం వేడి మీద మరిగించాలి. తర్వాత చల్లార్చి ఫిల్టర్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: మేడారం భక్తులపై ఆంక్షలు..బంగారం కొనుగోలుకు ఆధార్ తప్పనిసరి..!!
