ఆరు హామీల అమల విషయంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి. ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ దెగ్గర ఎలాంటి పక్కా ప్రణాళికలు లేవని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
‘‘తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, హామీలను అమలు చేసేందుకు ఆయన ప్రభుత్వం ఇంతవరకు ఒక విధానాన్ని రూపొందించలేదు. రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు సీఎం తన ప్రణాళికలను ప్రకటించలేదు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎలా చేపడతారు? రానున్న లోక్‌సభ ఎన్నికలకు నడుం బిగించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు కిషన్‌రెడ్డి. రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా గాలి వీస్తోందని, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు దీనిని ఉపయోగించుకోవాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
The post తొలిసారి రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కిషన్ రెడ్డి appeared first on tnewstelugu.com.
