తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. దంచికొడుతున్న ఎండలతో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజాలు ఎండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండాకాలం ఇంకా ప్రారంభం అవ్వకుముందే ఈ స్థాయిలో ఎండలు ఉంటే..రానున్న రోజులు ఏ మాదిరి ఉంటాయోనని జంకుతున్నారు జనాలు.
కాగా రాబోయే నాలుగు రోజుల్లో తీవ్రమైన వేడి వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఐదు నుంచి 6రోజుల పాటు వాతావరణం చల్లబడుతుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం, రాత్రి సమయాల్లో చల్లటి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఫిబ్రవరి 16తర్వాత క్రమేణ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపింది. ఫిబ్రవరి 10,11వ తేదీల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: ఐఎఫ్ఎస్ అధికారి ఇంట్లో నగదు కట్టలు చూసి ఈడీ షాక్..!!
అటు గ్రేటర్ హైదరాబాద్ లో ఎండలు భారీగా నమోదు అవుతున్నాయి. ఫిబ్రవరి మొదటివారంలో నమోదు అయిన పగటి ఉష్ణోగ్రతలతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. గత 3 రోజుల్లో భారీగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలతో నగరవాసులు గ్రేటర్ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గురువారి జూబ్లిహిల్స్ 38.4 డిగ్రీలు, సరూర్ నగర్ ,చందానగర్ లో 38.3 డిగ్రీలు, బేగంపేటలో 37.6డిగ్రీలు, ఉప్పల్ లో 37.3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇప్పుడే ఎండలు ఇలా మండుతుంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటాయోనని జనాలు భయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: కాలిఫోర్నియాలో కూలిన ఆర్మీ హెలికాప్టర్..ఐదుగురు జవాన్లు మృతి..!!
