బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశరావు మాట్లాడుతూ దేశానికి సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వం అవసరమన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను చూసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ప్రతినిధుల సమావేశంలో బీఆర్‌ఎస్ బలం పార్టీ నేతలు, సీఎం కేసీఆర్, కార్యకర్తల్లోనే ఉందని స్పష్టం చేశారు.
పార్టీ జాతీయ ధ్యేయంగా ముందుకు సాగేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని కేకే సూచించారు. హైదరాబాద్‌ను మంత్రి కేటీఆర్ గొప్పగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, కొత్త సచివాలయం వంటి భారీ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు.
నిన్న మొన్నటి వరకు నది సముద్రం పాలయ్యిందని తెలిపారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ హయాంలో సాగునీరు, తాగునీటి అవసరాల కోసం నదులను పొలాలకు, ఇళ్లకు మళ్లిస్తున్నారు. గత ప్రభుత్వాలు 75 ఏళ్లలో చేయలేనివి 9 ఏళ్లలో చేయగలిగామన్నారు. అదానీ కోసం ప్రధాని మోదీ దేశాన్ని దోచుకుంటుంటే, సీఎం కేసీఆర్ మళ్లీ పేదల సంక్షేమం కోసం చేస్తున్నారన్నారు కేకే.
The post దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం appeared first on T News Telugu
