హైదరాబాద్: నయవంచనకు నిలువెత్తు రూపం.. కాంగ్రెస్ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీని, బిజెపిని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదని, ఇండియా కూటమికి అంతకన్నా లేదని, మిత్రపక్షాలు దూరం కావడమే ఇందుకు నిదర్శనం అని ట్విట్టర్(ఎక్స్) వేదికగా పేర్కొన్నారు.
Also Read.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై 89 క్రిమినల్ కేసులు!
ఆదిలోనే ఇండియా కూటమికి బీటలు వచ్చాయని, కాంగ్రెస్‌ను వీడి టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒంటరిపోరుకు సిద్ధమయ్యాయని తెలిపారు. మిత్రపక్షాలను ఒప్పించలేని కాంగ్రెస్, దేశ ప్రజలను ఏం మెప్పిస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికలతో కాంగ్రెస్ కథ ముగుస్తుందన్నారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో.. ప్రాంతీయ శక్తుల పాత్రే కీలకమని పేర్కొన్నారు.
Also Read.. ఇద్దరు కొడుకులకు చెరో రూ. 500 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి
దేశప్రజల చూపు ప్రాంతీయ శక్తులవైపే ఉందన్న కేటీఆర్.. తెలంగాణలో కేసీఆర్ అయినా.. బెంగాల్‌లో మమతా అయినా.. పంజాబ్, ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేది బలమైన ప్రాంతీయ పార్టీలేనని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీల పాత్రే కీలకమని ఆయన పేర్కొన్నారు.
The post నయవంచనకు నిలువెత్తు రూపం కాంగ్రెస్.. కేటీఆర్ ఫైర్ appeared first on tnewstelugu.com.
