నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి పిడుగుపాటుకు తండ్రీకొడుకులు మృతి చెందారు.
స్థానికుల కథనం ప్రకారం.. వెలుగొండ గ్రామానికి చెందిన నాగయ్య (55 ఏళ్లు), అతని కుమారుడు రమేష్ (25 ఏళ్లు) బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో కౌలు రైతులకు చెందిన పొలాన్ని సాగు చేస్తున్నారు.
ఆదివారం వరి కోత సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో వారు ఉన్న ప్రాంతంలో పిడుగు పడడంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు.
