నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఇండియన్ ఆర్మీ. రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆర్మీలో ఎన్ సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 56వ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లుగా చేరేందుకు దరఖాస్తులను కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకుంటే 2024 అక్టోబర్ లో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశం పొందవచ్చు. అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నోటిఫికేషన్ లో వెల్లడించారు. అదేవిధంగా ఏదైనా డిగ్రీతోపాటు ఎన్ సీసీ అర్హత ఖచ్చితంగా ఉండాలి.
నోటిఫికేషన్ లో పేర్కొన్న అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు అన్ లైన్ లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. జనవరి 8 నుంచి ఫిబ్రవరి 6 వరకు అప్లికేషన్స్ సమర్పించవచ్చు. www.joinindianarmy.nic.in లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.
ఖాళీలు:
మొత్తం ఖాళీలు 55. అందులో 50పోస్టులు ఎన్ సీసీ ఉన్నాయి. యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి 5 పోస్టులను కేటాయించారు. ఇక జనరల్ కేటగిరీలో 45పోస్టులు, ఎన్ సీసీ 05 పోస్టులు ఉన్నాయి. కనీసం 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేవారికి ఎన్ సీసీ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.
విద్యార్హత:
యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కనీసం 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వీరికి ఎన్ సీసీ సర్టిఫికేట్ అవసరం ఉండదు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తం రెండు దశల్లో ఈ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇందులో సెలక్ట్ అయిన వారికి చివరిగా మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఫైనల్ అభ్యర్థులకు ట్రైనింగ్ కాలంలో నెలకు రూ. 56,100 స్టైఫండ్ చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తవ్వగానే లెఫ్టినెంట్ హోదాలో పోస్టింగ్ ఇస్తారు. అప్పుడు పే స్కేల్ సాలరీ ఉంటుంది.
ఇది కూడా చదవండి: రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం..జనవరి 22న ఆ దేశంలో పబ్లిక్ హాలిడే..!!
The post నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..జీతం 65వేలు..!! appeared first on tnewstelugu.com.
