RRB ALP Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త అందించింది రైల్వేశాఖ. దేశంలోని అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ రిక్రూట్ మెంట్ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
అహ్మాదాబాద్, అజ్ మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్ పూర్, చండీఘర్, గువాహటి, జమ్ము కశ్మీర్, చెన్నై, కోల్ కతా, మాల్దా, ముంబై, ముజఫర్ పూర్, పాట్నా, ప్రయాగ్ రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్ పూర్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
విద్యా అర్హత :
పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్రైట్/మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ (రేడియో/టీవీ), ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ (మోటార్ వెహికల్), వైర్మెన్, ట్రాక్టర్ మెకానిక్,లలో అనుభవం ఉండాలి. ఆర్మేచర్, కాయిల్ విండర్, మెకానికల్ (డీజిల్), హీట్ ఇంజిన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ ట్రేడ్లలో గుర్తింపు పొందిన ఎన్సివిటి/ఎస్సివిటి నుండి ITI కలిగి ఉండాలి.ITIకి బదులుగా గుర్తింపు పొందిన సంస్థ నుండి మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మూడు డిప్లొమాలతో లేదా ఈ ఇంజనీరింగ్ సబ్జెక్టుల యొక్క విభిన్న స్ట్రీమ్ల కలయికతో 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ఇది కూడా చదవండి: రహదారి గుంతకు నవ వధువు బలి..!!
వయోపరిమితి:
దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు. మరిన్ని వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్లో ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు ప్రక్రియ జనవరి 20 నుండి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 19, 2024 వరకు కొనసాగుతుంది. దరఖాస్తు రుసుము రూ.500, రూ.250గా నిర్ణయించబడింది.
The post నిరుద్యోగులకు శుభవార్త. రైల్వేలో 5వేలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు..!! appeared first on tnewstelugu.com.
