దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్షకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9 రాత్రి 9గంటల వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ,తెలుగు తోపాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు https://neet.nta.mic.in/వెబ్ సైట్ ద్వారా లాగిన్ అవ్వండి.
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 1700 కాగా , జనరల్ ఈడబ్య్లూఎస్ , ఓబీసీ, ఎన్ సీఎల్ అభ్యర్థులకు రూ. 1600 , ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జండర్ అభ్యర్థులు రూ. 1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్ , పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 5న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20గంటల మధ్య జరుగుతుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఎన్టీఏ ఈ పరీక్ష నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: ఈ నెల 28న టీఎస్ లాసెట్ -2024 నోటిఫికేషన్ను విడుదల
The post నీట్ పరీక్షకు నోటిఫికేషన్ రిలీజ్…నేటి నుంచి దరఖాస్తులు షురూ..!! appeared first on tnewstelugu.com.
