దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్స్, బీఆర్క్ తొలి విడత 2024 పరీక్షలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉభయ జిల్లాల్లోని 7కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రతిపరీక్ష కేంద్రం దగ్గర విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చాలని ఖమ్మం జిల్లా సమన్వయకర్త పార్వతిరెడ్డి తెలిపారు.
విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. బుధవారం జరిగే బీఆర్క్ మొదటి విడత పరీక్షకు ఖమ్మం జిల్లాలో 1071 మంది భద్రాద్రి జిల్లాలో 131 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈనెల 27,29,30,31 ఫిబ్రవరి 1న నిర్వహించే జేఈఈ మెయిన్స్ మొదటి విడత పరీక్షలకు ఖమ్మం జిల్లాలో 7960 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొదటి షిఫ్టులో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండో షిఫ్టులో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఉదయం 8.30 మధ్యాహ్నం 2.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే విద్యార్థులు చేరుకోవాలి. ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేదంటే ఆధార్ తో వేలిముద్ర అనుసంధానమై ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మాత్రమే విద్యార్థులు పరీక్ష రాసే ప్రదేశం తెలుస్తుంది. కాబట్టి వేరేవారు పరీక్ష రాసే ఛాన్స్ ఉండదు.
ఆధార్, పాస్ పోర్టు, రేషన్ కార్డు లేదంటే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, ట్రాన్స్ పరేంట్ పెన్, అడ్మిట్ కార్డు, బీఆర్క్ పరీక్షకు అయితే పెన్సిల్, స్కేల్,రబ్బర్, జామెంట్రీ బాక్స్, వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి.
ఇది కూడా చదవండి: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన ఆర్మీ జవాన్..!!
