తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర శ్రీ లింగమాతుల స్వామి జాతర నేడు ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్ పల్లి శివారులో యాదవుల ఆరాధ్యదైవం లింగమాతుల స్వామి ఐదురోజుల పాటు కొలువై ఉన్నారు.
మొదటిరోజు గంపల ప్రదక్షిణ, రెండోరోజు చౌడమ్మ తల్లి బోనాలు, మూడోరోజు స్వామివారి కల్యాణోత్సవం, నాలుగోరోజు అమావాస్య, ఐదోరోజు ప్రత్యేక అలంకరణ కార్యక్రమం. ఈ శ్రీ లింగమాతుల స్వామి జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
