ఏ శుభకార్యం చేయాలన్నా మంచి ముహుర్తం ఉండాలి. మీర ముఖ్యంగా పెళ్లిలకు దివ్యమైన ముహుర్తాలు ఉంటేనే కల్యాణ వేడుకలకు తేదీలను ఖరారు చేసుకుంటారు.పెళ్లికి ముహుర్తం పెట్టుకుంటారు. అయితే శుభ ముహుర్తాలకు నెలవైన మాఘమాసం శనివారం నుంచి ప్రారంభం అవుతుంది. గత కొన్ని రోజులు మూడాలు ఉన్నాయి. ఇప్పుడు మంచిరోజులు వచ్చాయి. ఈనెల నుంచి ఏప్రిల్ వరకు శుభకార్యాలకు అనుకూలంగా ఉంది.
నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు, శంకుస్తాపనలు, నూతన గ్రుహప్రవేశాలు, విగ్రహ ప్రతిష్టాపనలు చేయడానికి అవకాశం ఉంది. ఈనెల 11 నుంచి ఏప్రిల్ 26వరకు ముహుర్తాలు ఉన్నాయని వేదపండితులు చెబుతున్నారు. ఈనెల 14న వసంత పంచమి రోజున వందల్లో పెళ్లిళ్లు ఉన్నాయి. అన్ని కల్యాణ మండపాలు ముందే బుక్ అయ్యాయి. బ్యాండే మేళాలు, ఫొటో, వీడియో, గ్రాఫర్లు, పూజారులు, క్యాటరింగ్, డెకరేటర్లు, ఈవెంట్ మేనేజర్లు బిజీ కానున్నారు.
ఫిబ్రవరిలో 11,13,14,15,18,19,21,22, 24
మార్చిలో 1,3,7,11,13,16,17,19,20,24,25,27,28,30
ఏప్రిల్ లో 1,3,4,5,6,9,18,19,20,21,22,24,26 తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు.
కాగా ఏప్రిల్ తర్వాత మళ్లీ మే నెలలో మంచి ముహుర్తాలు లేవు. వచ్చే నెల జూన్, జులై లో కూడా ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ఇక ఏప్రిల్ లో ముహుర్తాలు పెట్టుకోని వారికి రెండు నెలల తర్వాత ఆగస్టులోనే ముహుర్తాలు ఉన్నాయని పండితులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: పాకిస్తాన్ లో హంగ్..మ్యాజిక్ ఫిగర్ కు ఏ పార్టీ చేరుకోలేదు..!!
