కేంద్రం రాయితీ ధరకు అందిస్తున్న భారత్ బియ్యం విక్రయాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్ రైస్ పేరుతో కిలో రూ. 29 చొప్పున 5,10 కిలోల బ్యాగుల్లో ఇవి లభించనున్నాయి. ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేడు ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో విక్రయాలను ప్రారంభించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. తొలిదశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లో భారత్ రైసును విక్రయించనున్నారు. దీనికోసం 5లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ సరఫరా చేయనుంది. భారత్ రైసును ఈ కామర్స్ వేదికల ద్వారా కొనుగోలు చేయవచ్చని కేంద్రం తెలిపింది.
ఇది కూడా చదవండి: బ్రిటన్ రాజు చార్లెస్ III క్యాన్సర్..!!
గ్రీన్‌కార్డు కోసం ఎదురుచేస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్..ఆ కీలక బిల్లుకు అమెరికా గ్రీన్ సిగ్నల్..!!
The post నేటి నుంచే భారత్ బియ్యం విక్రయాలు..! appeared first on tnewstelugu.com.
