హైదరాబాద్: బీఆర్ఎస్ మరో అత్యాధునిక మెగా నిర్మాణాన్ని ప్రారంభిస్తోంది. దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా హైదరాబాద్ శివారులోని కోకాపేటలో 11 ఎకరాల స్థలంలో 15 అంతస్తుల్లో అత్యాధునిక పరిశోధన, శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
రాజకీయ అవగాహన కార్యక్రమాలు, శిక్షణా సమావేశాలు, నాయకుల కోసం సమగ్ర సమాచార కేంద్రంగా రూపొందించిన “భారత్ భవన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్”కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. భవన రూపకల్పన, నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
