టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ వర్ధంతి నేడు. తెలుగు భాషకు, తెలుగు వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్. నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, తెలుగు సినీ పరిశ్రమను ఏలిన అనంతరం ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వారి సమస్యలు తీరుస్తూ ఎంతోమందికి ఆరాధ్యదైవంలా మారారు. ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఆయన్ని తలుచుకుంటున్నామంటే ఆయన సాధించిన విజయాలు, చేసిన మంచి అలాంటిది.
Read Also: రన్నింగ్ ట్రైన్లో దొంగతనం.. పట్టుకొని ట్రైన్ బయట కట్టేసిన ప్రయాణికులు
నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులర్పించారు. గురువారం తెల్లవారుజామునే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. పలువురు ప్రముఖులు, అభిమానులు కూడా నివాళలర్పించారు. దాంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.
The post నేడు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి.. తాతకు నివాళులర్పించిన మనవళ్లు appeared first on tnewstelugu.com.
