నేడే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా అడుగుపెడుతున్నారు. కేసీఆర్ కాలుజారి పడిపోవడంతో ఇతర ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయలేకపోయారు. అందుకే నేడు ప్రమాణ స్వీకారం జరుగనుంది.
కేసీఆర్ నేడు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి చేరుకుని, 12:45 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం శాసనసభాపక్ష కార్యాలయంలో పూజలు చేసి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేసిన కేసీఆర్ గజ్వేల్ నుంచి విజయం సాధించారు కేసీఆర్.
The post నేడే కేసీఆర్ ప్రమాణస్వీకారం.. ఆ వెంటనే కథనరంగంలోకి..! appeared first on tnewstelugu.com.
