పదో తరగతి, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇస్రో. ఇస్రో కొంతకాలం క్రితం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ దగ్గర పడింది. మీరు ఇంకా పూర్తి చేయకపోతే, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం.
యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ కోసం ఇస్రో అనేక పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 16 ఫిబ్రవరి 2024.దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 224 పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులు సైంటిస్ట్, ఇంజనీర్, లైబ్రరీ అసిస్టెంట్, ఫైర్‌మెన్, డ్రైవర్, డ్రాట్స్‌మన్ పోస్టులు ఉన్నాయి. పోస్ట్ ప్రకారం, పదవ తరగతి, ఇంటర్ పాస్ అయి సంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్ లేదా PG డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు అన్ లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఇస్రో వెబ్ సైట్ ను సందర్శించడం వల్ల మరింత సమాచారం తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ చిరునామా – isro.gov.in.అనేక దశల పరీక్ష ఇవ్వవలసి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ వంటివి. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డివి రౌండ్‌తో పాటు వైద్య పరీక్షలకు చూడా హాజరవ్వాలి. దరఖాస్తు చేయడానికి అర్హత ప్రమాణాలు పోస్ట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. అన్ని వివరాలు తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లో ఇచ్చిన నోటీసును చెక్ చేసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి: కాలిఫోర్నియాలో అనుమానాస్పద స్థితిలో భారతీయ కుటుంబం మృతి
The post పదో తరగతి ఉత్తీర్ణతతో ఇస్రో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..!! appeared first on tnewstelugu.com.
