పద్మశ్రీ గ్రహీత, ప్రముఖ చెఫ్ ఇంతియాజ్ ఖురేషి చనిపోయారు.. ఆయన వయసు 93 ఏళ్లు. ఐటీసీ హోటల్స్ ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. ఖురేషి ఫిబ్రవరి 2, 1931లో ఆయన లక్నోలో జన్మించారు. దమ్ పుక్త్, బుఖారా లాంటి వంటకాలను ఆయన క్రియేట్ చేశారు. భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేశారు. 1962లో సైనో ఇండియన్ వార్‌లో భారతీయ ఆర్మీకి కేటరింగ్ చేశారు 1979లో ఆయన ఐటీసీ హోటల్స్ లో చేరారు. అక్కడ ఎన్నో రకాల వినూత్న వంటకాలతో ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు.
ప్రధానులు, రాష్ట్రపతిలకు ఇచ్చే విందులకు ఆయన వంటలు చేసేవారు. 2016లో కేంద్ర ప్రభుత్వం చెఫ్ ఇంతియాజ్‌కు పద్మశ్రీ అవార్డును బహూకరించింది.
ఇది కూడా చదవండి: అసెంబ్లీలో కులగణన తీర్మానంపై చర్చ.. మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్
