హైదరాబాద్లోని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల. బుధవారం నాడు షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానం పలకడానికే పవన్ కల్యాణ్ తో ఈ భేటీ జరిగింది. ఇటీవలే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసిన వైఎస్ షర్మిల తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు తోటి రాజకీయ నేతలను కలుస్తున్నారు.
కాంగ్రెస్లో విలీనం జనవరి 5న జరుగగా.. పార్టీలో చేరడానికి ముందు షర్మిల తన సోదరుడు జగన్మోహన్రెడ్డితో సహా తన కుటుంబ సభ్యులకు ఆహ్వానాలు పంపారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి, చంద్రబాబులని సైతం కలిసింది షర్మిల. అనంతరం నేడు పవన్ కళ్యాణ్ ని కూడా వివాహానికి ఆహ్వానించటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది.
The post పవన్ ఇంటికి షర్మిల..! appeared first on tnewstelugu.com.