హైదరాబాద్: అమృత్‌సర్ నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. దాదాపు 30 నిమిషాల పాటు అది పాకిస్థాన్ గగనతలంలో ఉండిపోయినట్లు సమాచారం.
అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇండిగో విమానం లాహోర్ సమీపంలోని గుర్జన్‌వాలాకు రాత్రి 7.30 గంటలకు వచ్చి 8.11 గంటలకు సురక్షితంగా భారత్‌కు చేరుకుందని పాక్ మీడియా పేర్కొంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఇండిగో కానీ, భారత ప్రభుత్వం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
పాకిస్థాన్ గగనతలంలో కూలిన ఇండిగో విమానం తర్వాత..! appeared first on T News Telugu
