75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు భారత్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు దేశాలు భారత్‌కు శుభాకాంక్షలు తెలిపాయి. ఈ క్రమంలోనే రష్యా సైతం భారత్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ఇండియా పాటకు స్టెప్పులేస్తూ.. ‘హ్యాపీ రిపబ్లిక్ డే’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన ‘గదర్’చిత్రంలోని పాటకు రష్యా ఎంబసీ ఉద్యోగులు, చిన్నారులు, ప్రొఫెషనల్ డ్యాన్సర్లు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని న్యూఢిల్లీలోని రష్యా దౌత్య కార్యాలయం ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ‘గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత స్నేహితులకు ఈ అమృత్ కాల్ మరింత ప్రకాశవంతంగా ఉండాలి. రష్యా-భారతీయ దోస్తీ కలకాలం వర్ధిల్లాలి’ అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Happy Republic Day, #India!
From Russia with love
#RepublicDay2024 #RussiaIndia #дружбаदोस्ती pic.twitter.com/tmsW6iHOXE
— Russia in India
(@RusEmbIndia) January 26, 2024
The post పాటకు స్టెప్పులేస్తూ భారత్‌కు రష్యా స్పెషల్ విషెస్ appeared first on tnewstelugu.com.


(@RusEmbIndia)