హైదరాబాద్: పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో నమ్మించి ఆ తరువాత పెట్టుబడులు పెట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అమీర్‌పేట్‌కు చెందిన బాధితురాలికి పార్ట్‌టైమ్ జాబ్ ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు నమ్మించారు. అనంతరం రూ. 4.75 లక్షలు మోసం చేశారు.
Also Read.. అత్తింటి వేధింపులు భరించలేక ఒకేసారి తోటికోడళ్ల ఆత్మహత్య
సీసీఎస్ సైబర్‌క్రైమ్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ నుంచి మోసం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. బ్యాంకు ఖాతాలను పరిశీలించడంతో అవి నకిలీ ఆధార్, నకిలీ పాన్‌కార్డులతో హర్యాన రాష్ట్రంలోని ఫరీదాబాద్‌కు చెందిన హిమాన్షు, ప్రవీణ్‌లు తెరిచినట్లు గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. సైబర్ మోసానికి పాల్పడిన దేవేందర్ పంచాల్ పరారీలో ఉన్నాడని జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.
