ఆదిలాబాద్ : ఏ పార్టీ్కైనా కార్యకర్తలే బలమని, బీఆర్ఎస్ కు మాత్రం కథానాయకులని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఅర్ఎస్ కు భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు , మాజీ ఎంపీ గొడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ పాల్గొన్నారు.
Also Read.. సూర్యాపేట నుంచి మళ్ళీ బీఆర్ఎస్ గెలుపు మొదలైంది
The post పార్లమెంట్ ఎన్నికల్లో బీఅర్ఎస్కు భారీ మెజారిటీ ఇవ్వాలి appeared first on tnewstelugu.com.
