తమ దేశంలో పడిపోతున్న సంతానోత్పత్తిని పెంచేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. బూయంగ్ కంపెనీ తమ ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. పిల్లల్ని కన్న ప్రతిసారి రూ.62.54 లక్షలు చెల్లిస్తామని తెలిపింది.
2021లో 70 మంది పిల్లలకు జన్మనిచ్చిన ఉద్యోగులకూ రూ.43.77 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది.ముగ్గురు పిల్లలున్న ఉద్యోగులకు రూ.1.86 కోట్ల నగదు లేదా అద్దె ఇంటి సదుపాయాన్ని కల్పించాలని అనుకుంటోంది.ఈ ఆఫర్లు ఆడ, మగ ఉద్యోగులిద్దరికీ వర్తిస్తాయంది. 2022లో ప్రపంచంలో అతి తక్కువ సంతానోత్పత్తి జరుుగుతున్నది దక్షిణ కొరియాలోనేనని తేలింది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్.. అసెంబ్లీలోనూ అబద్ధాలే చెప్పింది, చూపించింది
