బ్యాంక్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ లాగానే, పోస్టాఫీసులో కూడా ఒక పథకం ఉంది. అదే ఫిక్సెడ్ డిపాజిట్ ప్లాన్. ఈ పథకంలో, మీరు నాలుగు వేర్వేరు సమయ వ్యవధిలో డబ్బును డిపాజిట్ చేయడానికి ఎంచుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ల కాలపరిమితి ఐదేళ్ల వరకు ఉంటుంది. మీరు ఐదు సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే, మీరు 7.5% వడ్డీని పొందుతారు. మీరు ఒక సంవత్సరానికి డిపాజిట్ చేస్తే 6.8% వడ్డీని పొందుతారు, మీరు రెండేళ్లపాటు డిపాజిట్ చేస్తే 6.9% మరియు మీరు మూడేళ్లపాటు డిపాజిట్ చేస్తే 7% పొందుతారు.
కనీస డిపాజిట్ మొత్తం రూ. 1000 అయితే, గరిష్ట మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్ మొత్తానికి పరిమితి లేదు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్లో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే… ఐదేళ్ల వ్యవధి ముగిసిన తర్వాత.. అసలు రూ.5 లక్షలతో పాటు మరో రూ.2,24,974 వడ్డీ వస్తుంది.
