ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో ఉంటానని అన్నారు ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి. ఇవాళ( శుక్రవారం) నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి క్యాంప్ కార్యాలయం వేదికగా ఉపయోగపడుతుందన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజాసమస్యలను పరిష్కరించాలని కేసీఆర్ గతంలో క్యాంప్ కార్యాలయాలను నిర్మించారని అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డిఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: అమ్మకానికి క్వీన్ ఎలిజబెత్ కారు
The post ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తా appeared first on tnewstelugu.com.
