
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం… ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. మంగళవారం ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ వైవీ గణేష్ డీఆర్వో రమాదేవి, టూరిజం, టీఎస్టీడీసీ అధికారులు సోమవారం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ హాజరుకానున్నారు. సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్, డ్రమ్మర్ శివమణి, గాయకుడు కార్తీక్, ఫ్లూటిస్ట్ నవీన్, బలగం చిత్రబృందం కూడా ప్రదర్శన ఇవ్వనున్నారు.
