సిద్దిపేట: క్యాన్సర్ రోగులకు శుభవార్త. హైదరాబాద్ నగరంలో అందించే కీమోథెరపీ సేవలు ఇకపై ప్రాంతీయ కేంద్రాల్లో అందించబడతాయి. సిద్దిపేట జీజీహెచ్ ఆస్పత్రిలో డే కేర్ కీమోథెరపీ విభాగాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
ప్రాంతీయ ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవల మాదిరిగానే ప్రాంతీయ కేంద్రాలకు కూడా కేన్సర్ సేవలను విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో డేకేర్ కీమోథెరపీ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
మొదటి సైకిల్ చికిత్సను హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే, నిమ్స్‌లో, మిగిలిన సైకిల్స్‌ను జిల్లా ఆస్పత్రుల్లో నిర్వహిస్తామని చెప్పారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో ఒక్కో సైకిల్ ధర రూ.30 వేలు ఉంటుందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
