అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ అవాస్తవాలని ఆధారాలతో సహా తిప్పి కొట్టారు మాజీ మంత్రి హరీశ్ రావు. నల్లగొండ సభకు స్పందనగా మీరు ప్రాజెక్టులు అప్పజెప్పబోమని తీర్మానం చేయడం సంతోషమని.. మేము స్వాగతిస్తున్నామన్నారు. అసెంబ్లీలో ప్రాజెక్టులపై మాట్లాడిన హరీశ్ రావు.. కాంగ్రెస్ కృష్ణా అంశంపై ఇచ్చిన దానిలో వాస్తవాలు కాదని.. అవి అవాస్తవాలన్నారు. అవాస్తవాల పుస్తకం అని బుక్ పేరు రాయల్సింది అని అన్నారు. ప్రాజెక్టులు అప్పగించే విషయం నాటి ప్రభుత్వం ఒప్పుకున్నది అని అబద్ధాలు చెప్పింది. అవాస్తవాలు చెప్పింది.
అవాస్తవాలను ఏంటనేవి సభలో తెలిపారు హరీశ్ రావు. అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేఅర్ఎంబి కనిపించలేదు. ఎందుకంటే మ్యాటర్ సబ్ జుడిస్ అని ఉంది. రెండోది..కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ సవాలు చేయలేదన్నారు. దీనికి సాక్ష్యం రాహుల్ బొజ్జా రాసిన ఆధారం చుడోచ్చు. 15.07.2021 గెజిట్ లో మాడిఫికేషన్ చేయాలని రాశారు. ఇక మూడవ అవాస్తవం..16వ కేఆర్ఎంబీ సమావేశంలో చెప్పింది ఏమిటి. ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని స్పష్టం చేశారు. నాలుగవ అవస్తావం…రెండో అపెక్స్ కౌన్సిల్ లో నీటి వాట వ్యతిరేకించడం జరిగింది. ఈ విషయం పై 27 లెటర్స్ రాయడం జరిగిందని తెలిపారు హరీశ్ రావు.
ఇది కూడా చదవండి: ఉద్యోగాలకు వయోపరిమితి మరో రెండేండ్లు పెంచిన ప్రభుత్వం
The post ప్రాజెక్టులు అప్పజెప్పబోమని కాంగ్రెస్ తీర్మానం చేయడం సంతోషం appeared first on tnewstelugu.com.
