తనను వేధిస్తున్న ప్రియుడిని అంతమొందించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ప్లాన్ చేసింది. ఎవరులేని సమయంలో ఇంటికి పిలిచింది. భర్త, తల్లిదండ్రులో కలిసి అతన్ని మట్టుబెట్టింది. ఈ ఘటన చెన్నూరు మండలంలోని కమ్మరిపల్లిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కమ్మరిపల్లికి చెందిన మొగిలి సుగుణక్క ఓదెలు దంపతుల కూతురు పద్మను 12 సంవత్సరాల క్రితం పొన్నారంవాసి బట్టె శేఖర్ కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన రామగిరి మహేందర్ హర్వెస్టర్ డ్రైవర్ గా పనిచేస్తన్నాడు. 5ఏళ్ల క్రితం పద్మతో పరిచయం అయ్యింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. నాలుగు నెలల క్రితం మహేందర్ తో వెళ్లిపోయింది. దీంతో తన భార్య తప్పిపోయిందని శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత నవంబర్ లో పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినాకూడా తన భర్తతో ఉండేందుకు నిరాకరించి మహేందర్ తో వెళ్లిపోయింది. ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో నెలక్రితం పద్మ కమ్మరిపల్లి వచ్చి అత్తింట్లో ఉంటుంది.
మహేందర్ తరచూగా కమ్మరిపల్లికి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని..అతన్ని వదిలించుకునేందుకు ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది. శేఖర్ కమ్మర్ పల్లికి వచ్చాడు. భర్త, తల్లిదండ్రులతో కలిసి అతన్ని చంపేయాలని డిసైడ్ అయ్యారు. మంగళవారం రాత్రి పద్మ మహేందర్ కు ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరని రమ్మని చెప్పింది. మహేందర్ కమ్మరిపల్లికి చెందిన కడారి శేఖర్, జాలంపల్లి సాయిరాజ్ లతో కలిసి గ్రామంలోకి వచ్చాడు. ఇద్దరిని ఇంటి సమీపంలో ఉంచి పద్మ ఇంట్లోకి వెళ్లాడు. వెళ్లగానే కంటో కారంచల్లి కర్రలతో చితకబాదారు. మహేందర్ అక్కడిక్కడే మరణించారు. శవాన్ని ఎండ్లబండిలో గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి దహనం చేశారు.
అయితే మహేందర్ ను కొడుతుండగా అరుపులు, కేకలు విన్న బయట ఉన్న ఇద్దరు మహేందర్ సోదరుడికి ఫోన్ చేసి చెప్పారు. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీ ప్రాంతానికి వెళ్లి దహనమవుతున్న శవాన్ని పోస్టుమార్టం కోసం చెన్నూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని డీసీపీ సుధీర్ రాంనాథ్ కైకాన్ పరిశీలించారు. నిందితులు పద్మ, శేఖర్, ఓదెలు, సుగుణక్క పరారయ్యేందుకు చెన్నూరులోని బస్టాండ్ కు వెళ్లగా తమ పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ సుధీర్ తెలిపారు.
ఇది కూడా చదవండి :బరువు తగ్గాలంటే..ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి..!!
The post ప్రియుడ్ని కడతేర్చిన ప్రియురాలు.. అసలు విషయం తెలుస్తే షాక్ అవుతారు..!! appeared first on tnewstelugu.com.
