పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌ను మరో రోజు పొడిగిస్తున్నట్లు ఇవాళ( బుధవాంర) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఈ సెషన్‌ను ప్రకటించింది. ఈ సెషన్ జనవరి 31 నుండి ఫిబ్రవరి 9 వరకు కొనసాగున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. అయితే ఈ సెషన్‌ను ఫిబ్రవరి 10వ తేదీ శనివారం వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014కి ముందు, ఆ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను వివరిస్తూ ప్రభుత్వ శ్వేతపత్రం ప్రవేశపెడుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ప్రకటించారు. శ్వేతపత్రాన్ని ఉభయసభల్లోనూ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆర్థిక బిల్లు, బడ్జెట్ చర్చ, గ్రాంట్‌ల కోసం డిమాండ్ వంటి ప్రధాన అంశాలపై పార్లమెంటులో ఇంకా నిర్ణయం తీసుకోనందున , శ్వేతపత్రం సమర్పించాల్సి వున్నందున సెషన్ వ్యవధిని మరో రోజు పొడిగించడం అవసరమని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. సాధారణంగా పార్లమెంటు వారాంతాల్లో పనిచేయదు. కానీ శనివారం కూడా సభ సమావేశమైన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: మాట్లాడుతుండగా కరెంట్ కట్… మార్పు వచ్చిందంటూ హరీశ్ రావు సెటైర్లు
