మాంద్యం భయంతో తాజాగా మరో కంపెనీ కార్మికులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఐటీ, వ్యాపార సంస్థలు మాత్రమే లేఆఫ్‌లు చేశాయి. ఇప్పుడు ఈ జాబితాలో అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ చేరింది. కంపెనీ తన కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ నిర్ణయం అమెరికా, కెనడాలోని కంపెనీలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. మొత్తం 3,000 మందిని తొలగించనున్నట్లు తెలుస్తోంది. వీరిలో 2000 మంది రెగ్యులర్ ఉద్యోగులు, మిగిలిన 1000 మంది కాంట్రాక్టు కార్మికులు. వీరిలో అత్యధికులు ఉన్నత స్థాయి ఉద్యోగులే ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్ సహా ఇతర దేశాల్లో ఫోర్డ్ వాహనాలకు డిమాండ్ తగ్గి నిర్వహణ ఖర్చులు పెరిగాయి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా కార్మికులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
