బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి మంగళవారం వాయుగుండంగా మారనుందని నివేదిక పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. తెలంగాణలో కూడా నేడు (సోమవారం), రేపు (మంగళవారం) భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
